-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Selection of district team for state level chess tournament-MRGS-AndhraPradesh
-
రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీకి జిల్లా జట్టు ఎంపిక
ABN , First Publish Date - 2022-07-04T05:20:24+05:30 IST
జూలై 3: ఆల్ వైజాగ్ చెస్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా అండర్-9 బాలుర, బాలికల చెస్ టోర్నీ, జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఆదివారం ముగిశాయి.

విశాఖపట్నం(స్పోర్ట్సు), జూలై 3: ఆల్ వైజాగ్ చెస్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా అండర్-9 బాలుర, బాలికల చెస్ టోర్నీ, జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఆదివారం ముగిశాయి. నగరంలోని గాయత్రి విద్యామందిర్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగంలో వాసిరెడ్డి అర్జున్(4.5 పాయింట్లు), బొడ్డ శ్రీజైమోహన్(4 పాయింట్లు)....బాలికల విభాగంలో ముస్కాన్ పఠాన్(4 పాయింట్లు), దివ్య దర్శిని మోయిదా(3 పాయింట్లు) ప్రథమ ద్వితీయ స్థానాలను సాధించారు. ఈ నెల ఆరు నుంచి భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీలో జిల్లా జట్టుకు వీరు ప్రాతినిధ్యం వహిస్తారని టోర్నీ నిర్వాహక కార్యదర్శి వి.శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ వి.ప్రసాద్, జిల్లా చెస్ సంఘం ప్రతినిధులు వి.బాలకృష్ణారావు, బాబూరావు, కె.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.