సీమకు దశాబ్దాలుగా అన్యాయం

ABN , First Publish Date - 2022-11-17T03:41:03+05:30 IST

పాలకులు దశాబ్దాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని, మూడు రాజధానుల పేరుతో ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధికి కార్యాచరణ ..

సీమకు దశాబ్దాలుగా అన్యాయం

రాయలసీమ సాగునీటి సాధన సమితి నేత దశరథరామిరెడ్డి

విజయవాడ(ధర్నాచౌక్‌), నవంబరు 16 : పాలకులు దశాబ్దాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని, మూడు రాజధానుల పేరుతో ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధికి కార్యాచరణ చేపట్టకపోవడం అన్యాయమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అ న్నారు. రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్‌ ఒడంబడిక అమలు చేయాలని కోరు తూ రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో ‘రాయలసీమ సత్యాగ్రహాదీక్ష’ను బుధవారం నిర్వహించారు. విప్లవ కళా కారిణి విమల, న్యూడెమొక్రటిక్‌ పార్టీ నేత పొలారి, కుల నిర్మూలన సమితి నే త దుడ్డు కృష్ణ, పలు సంఘాల నేతలు ఈ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

Updated Date - 2022-11-17T03:41:04+05:30 IST