సమస్యలపై సర్పంచులు గళం

ABN , First Publish Date - 2022-06-11T06:20:15+05:30 IST

మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఇక్కడ వాడివేడిగా సాగింది. ఎంపీపీ గాడి కాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికార పార్టీకి చెందిన పలువురు సర్పంచులు ఒకరి తరువాత ఒకరు మాట్లాడేందుకు పోటీపడడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చాలా మంది సభ్యులు ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖల అధికారుల పనితీరుపై నిప్పులు చెరి గారు.

సమస్యలపై సర్పంచులు గళం
సమావేశంలో ఆర్‌అండ్‌బీ జేఈని నిలదీస్తున్న సభ్యులు


 వాడివేడిగా చోడవరం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం

 ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖల అధికారులను నిలదీసిన సభ్యులు

  ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన 

చోడవరం, జూన్‌ 10 : మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఇక్కడ వాడివేడిగా సాగింది. ఎంపీపీ గాడి కాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికార పార్టీకి చెందిన పలువురు సర్పంచులు ఒకరి తరువాత ఒకరు మాట్లాడేందుకు పోటీపడడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చాలా మంది సభ్యులు ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖల అధికారుల పనితీరుపై నిప్పులు చెరి గారు. గజపతినగరం సర్పంచు మళ్ల శ్రీను, బెన్నవోలు సర్పంచు మూడెడ్ల శంకరరావు, బైన ఈశ్వరరావు  తదితరులు ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై  మండిపడ్డారు. చోడవరం ప్రధాన రహదారిలో గోతులు పూడ్చడంలో సైతం అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తు న్నారని ఎండగట్టారు. ఈ కారణంగా పలువురు వాహనచోదకులు ప్రమా దాల బారిన పడుతున్నట్టు చెప్పారు. ఇదేం పనితీరంటూ ఆర్‌అండ్‌బీ జేఈ జ్ఞానేశ్వరరావును నిలదీశారు. అలాగే, జగనన్న కాలనీలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించే విషయంలో ఉన్నతాధికారులు చెప్పినా సదరు శాఖ అధికారులు మాట వినడం లేదని, తమ పం చాయతీల్లో విద్యుత్‌ సమస్యలపై అధి కారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నా రని పలువురు మండిపడ్డారు. ఇక చోడవరం పట్టణంలోని విద్యుత్‌ సమస్యపై గతంలో అధికారులతో సమా వేశం నిర్వహించి విన్నవించినా నేటికీ ఏమాత్రం మార్పు లేదని ఈపీడీసీఎల్‌ అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పని తీరుతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని, ఇదే కొనసాగితే చోడవరం ఈపీ డీసీఎల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేయవలసి వస్తుంది’ అని సభ్యులు హెచ్చరించారు. ఈ సమావేశానికి ఈపీ డీసీఎల్‌ రెగ్యులర్‌ జేఈలు రాకపోవడంతో ఇన్‌చార్జి సభ్యులు హాజరై సమాధానం ఇచ్చారు. ఎంపీడీవో శ్యాం సుందర్‌, తహసీల్దార్‌ తిరుమలబాబు, జడ్పీటీసీ మారిశెట్టి విజయ, వైస్‌ ఎంపీపీ గంగరాజు, సర్పంచులు, ఎంపీ టీసీలు.  అధికారులు పాల్గొన్నారు.

Read more