-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Restrictions on Chavithi festivals are terrible-NGTS-AndhraPradesh
-
‘చవితి’ ఉత్సవాలపై ఆంక్షలు దారుణం
ABN , First Publish Date - 2022-08-31T05:33:37+05:30 IST
హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
గాజువాక, ఆగస్టు 30: హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 73వ వార్డులో తెలుగు యువత గాజువాక అధ్యక్షుడు బలగ బాలునాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వినాయక ఉత్సవాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో లేని ఆంక్షలు మన ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నాయని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి వినాయకుడే తగిన బుద్ధిని ప్రసాదించాలన్నారు. చవితి పూజల్లో ప్రజలంతా మట్టి వినాయక ప్రతిమలనే వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ‘గాజువాక’ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, నాయకులు గొలగాని రమణ, అనంత్, సింహాద్రి, నరేశ్, ముత్యాలమ్మ, తదితరులు పాల్గొన్నారు.