-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Request of language volunteers to SPD for renewal-NGTS-AndhraPradesh
-
రెన్యువల్‌కు ఎస్‌పీడీకి భాషా వలంటీర్ల వినతి
ABN , First Publish Date - 2022-02-23T05:45:23+05:30 IST
తమను రెన్యువల్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్షా ఎస్‌పీడీ నాగేశ్వరరావుకు భాషా వలంటీర్లు మంగళవారం విజయవాడలో వినతిపత్రం సమర్పించారు.

పాడేరు, ఫిబ్రవరి 22: తమను రెన్యువల్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్షా ఎస్‌పీడీ నాగేశ్వరరావుకు భాషా వలంటీర్లు మంగళవారం విజయవాడలో వినతిపత్రం సమర్పించారు. చాలా ఏళ్లుగా గిరిజన ప్రాంతంలో మాతృభాషా బోధన చేస్తున్న తమను ఈఏడాది రెన్యువల్ చేయలేదని, దీంతో మారుమూల ప్రాంత పాఠశాలల్లో బాలలకు మాతృభాషా బోధన జరగడం లేదన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ్, సబ్జీ, గిరిజన సంఘం నేత కొర్రా నర్సయ్య, వలంటీర్ల సంఘం నేతలు నాయుడు, కుమారి, చిట్టిబాబు, చంద్రయ్య, వీరయ్య, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.