-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Repairs to BN Road-NGTS-AndhraPradesh
-
బీఎన్ రోడ్డుకు మరమ్మతులు
ABN , First Publish Date - 2022-08-15T06:15:09+05:30 IST
రావికమతం గుర్రయ్య కట్టు నుంచి కొత్తకోట వరకు బీఎన్ రోడ్డును కాంట్రాక్టర్ మరమ్మతులు చేస్తున్నారు.

రావికమతం, ఆగస్టు 14: రావికమతం గుర్రయ్య కట్టు నుంచి కొత్తకోట వరకు బీఎన్ రోడ్డును కాంట్రాక్టర్ మరమ్మతులు చేస్తున్నారు. ఈ రోడ్డుపై ఏర్పడిన గోతుల్లో మెటల్, సిమెంట్ వేసి చదును చేస్తున్నారు. రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడంతో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కాంట్రాక్టర్‌తో చర్చించారు. వడ్డాది నుంచి కొత్తకోట వరకు పూర్తిగా ధ్వంసమైన 20 కిలోమీటర్లు మేరైనా గోతులు కప్పాలని ఆదేశించడంతో మూడు రోజులుగా గుంతలను పూడ్చుస్తున్నారు.