స్టీట్‌ప్లాంట్‌లో రికార్డుల మోత....

ABN , First Publish Date - 2022-12-10T01:13:08+05:30 IST

ఉక్కు కర్మాగారంలోని బ్లాస్ట్‌ పర్నేస్‌-2 (కృష్ణ) రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. మూడు రోజులుగా ఎనిమిది వేల టన్నులకు పైగా హాట్‌ మెటల్‌ను ఉత్పత్తి చేస్తోంది.

స్టీట్‌ప్లాంట్‌లో రికార్డుల మోత....

బ్లాస్ట్‌ ఫర్నేస్‌-2లో రికార్డు స్థాయిలో హాట్‌ మెటల్‌ ఉత్పత్తి

ఉక్కునగరం, డిసెంబరు 9:

ఉక్కు కర్మాగారంలోని బ్లాస్ట్‌ పర్నేస్‌-2 (కృష్ణ) రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. మూడు రోజులుగా ఎనిమిది వేల టన్నులకు పైగా హాట్‌ మెటల్‌ను ఉత్పత్తి చేస్తోంది. గత మూడు రోజులుగా వరుసగా 8,030, 8,100, 8,500 టన్నుల హాట్‌ మెటల్‌ను ఉత్పత్తి చేసింది. ఈనెల ఏడో తేదీన గోదావరి, కృష్ణ బ్లాస్ట్‌ పర్నేస్‌లు రెండూ కలసి 15,700 టన్నుల ఉత్పత్తి సాధించగా, గురువారం 16,200 టన్నులు ఉత్పత్తి సాధించి సరికొత్త రికార్డు సృష్టించాయి. రికార్డు ఉత్పత్తి సాధనకు కృషి చేసిన కార్మికులను ఉక్కు సీఎండీ అతుల్‌ భట్‌, డైరెక్టర్‌ ఎకె సక్సేనా అభినందించారు.

Updated Date - 2022-12-10T01:13:09+05:30 IST