వదలని వాన

ABN , First Publish Date - 2022-10-11T06:43:44+05:30 IST

నగరాన్ని పది రోజులుగా వర్షం వదలడం లేదు. దఫదఫాలుగా రోజంతా పడుతూనే ఉంది.

వదలని వాన
ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద వర్షం వల్ల పొంగిన డ్రైనేజీ

రోజంతా ముసురు వాతావరణమే

దైనందిన జీవనంపై ప్రభావం

మరింత అధ్వానంగా తయారైన రహదారులు

క్షీణించిన పారిశుధ్యం

మరో నాలుగు రోజుల వర్షాలు


విశాఖపట్నం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):

నగరాన్ని పది రోజులుగా వర్షం వదలడం లేదు. దఫదఫాలుగా రోజంతా పడుతూనే ఉంది. కొన్ని పర్యాయాలు ఒక మోస్తరుగా, మరికొన్నిసార్లు భారీగా కురుస్తోంది. ఒక్కొక్కసారి ఐది నుంచి పది నిమిషాల మాత్రమే పడి నిలిచిపోతుంది. నగరంలో అన్ని ప్రాంతాల్లో ఒకేసారి కాకుండా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో పడుతోంది. సాఽధారణంగా సెప్టెంబరు చివరి వారం వచ్చేసరికి వర్షాలు తగ్గుతాయి. అక్టోబరులో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్‌లు వస్తే కుంభవృష్టిగా వర్షాలు కురిసి చెరువులు, రిజర్వాయర్లు నిండుతుంటాయి. ఈ ఏడాది గత నెల చివరి వారంలో రెండు, మూడు రోజులు వర్షాలు పడ్డాయి. మళ్లీ అక్టోబరు ఒకటో తేదీన ప్రారంభమై ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణంగా వినాయక చవితికి, దీపావళికి ముసురు ఉంటుంది. అటువంటిది ఈ ఏడాది దసరా ఉత్సవాలను ముసురు వెంటాడింది. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం రోజుల తరబడి ముసురు ఉండేది. మళ్లీ ఈ సంవత్సరం అలాంటి వాతావరణం కనిపిస్తోందని వృద్ధులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఒకసారి వర్షం కురిసిన తరువాత ఎండ కాయడం చూస్తున్నామని, అటువంటిది ఈ నెలలో రోజంతా జల్లులు పడుతూనే ఉన్నాయంటున్నారు. కాగా రోజుల తరబడి కొనసాగుతున్న వర్షం ప్రజల దైనందిన జీవితాలపై ప్రభావం చూపుతుంది. రోజువారీ కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు, ఆరుబయట వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు...ఇలా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. వర్షాలకు రోడ్లు మరింత దారుణంగా తయారయ్యాయి. పారిశుధ్యం క్షీణించింది. మరో నాలుగు రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర పరిసరాల్లో రిజర్వాయర్లు నిండాయి. Read more