రైతుకు నష్టం లేకుండా రొయ్యల కొనుగోళ్లు

ABN , First Publish Date - 2022-11-17T03:38:07+05:30 IST

‘‘ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చు తగ్గులను పరిశీలించి అటు రైతులు...

రైతుకు నష్టం లేకుండా రొయ్యల కొనుగోళ్లు

ఆక్వా పంట విరామం ఆలోచన అబద్ధం: ఎగుమతిదారుల సంఘం

అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చు తగ్గులను పరిశీలించి అటు రైతులు... ఇటు ఎగుమతిదారులతో సంప్రదించి ఉభయతారకంగా రొయ్యల కొనుగోలు ధరలు నిర్ణయించింది. రైతులకు నష్టం లేకుండా కొనుగోళ్లు జరపాలన్న ప్రభుత్వ ఆదేశాన్ని, అంతర్జాతీయ విపణిలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మేం పాటిస్తున్నాం’’ అని అఖిలభారత రొయ్యల ఎగుమతిదారుల సంఘం తెలిపింది. ఈ సంఘం బుధవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది. సజావుగా సాగుతున్న ఆక్వా రంగాన్ని అస్థిరపర్చి భాగస్వాముల మధ్య అభిప్రాయభేదాలు సృష్టించడానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. రొయ్యల ధర పడిపోయిందన్న కారణంతో రైతులు పంట విరామం ప్రకటించాలని ఆలోచిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

Updated Date - 2022-11-17T03:38:07+05:30 IST

Read more