-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Public support for Amaravati Farmers Yatra-NGTS-AndhraPradesh
-
అమరావతి రైతుల యాత్రకు ప్రజా మద్దతు
ABN , First Publish Date - 2022-09-11T06:07:06+05:30 IST
అమరావతి నుంచి అరసవిల్లి వరకు రైతుల యాత్రకు ఉత్తరాంధ్ర ప్రజలు మద్దతు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ అన్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ
మహారాణిపేట, సెప్టెంబరు 10: అమరావతి నుంచి అరసవిల్లి వరకు రైతుల యాత్రకు ఉత్తరాంధ్ర ప్రజలు మద్దతు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాత్రను సజావుగా జరిపించాలని ఆదేశించిన హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. హైకోర్టు ఉత్తర్వులను మంత్రి అమర్‌నాథ్ స్వాగతిస్తున్నదీ, లేనిదీ తెలియజేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అమరావతి రైతుల పాదయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కోనేటి సురేశ్, సత్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు.