పోర్టు ఆస్తుల ప్రైవేటీకరణపై నిరసన

ABN , First Publish Date - 2022-09-10T05:58:14+05:30 IST

పోర్టు ట్రస్టు ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటాన్ని పోర్టు అఖిల పక్ష కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ఏఐటీయూసీ నాయకుడు మసేన్‌ అన్నారు

పోర్టు ఆస్తుల ప్రైవేటీకరణపై నిరసన
ఆందోళన చేస్తున్న అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు

మహారాణిపేట, సెప్టెంబరు 9: పోర్టు ట్రస్టు ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటాన్ని పోర్టు అఖిల పక్ష కార్మిక సంఘాలు తీవ్రంగా  వ్యతిరేకిస్తున్నాయని ఏఐటీయూసీ నాయకుడు మసేన్‌ అన్నారు. శుక్రవారం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పోర్టు అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోర్టు పరిపాలన భవనం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయలు విలువ చేసే పోర్టు ఆస్తులను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇందులోభాగంగానే పోర్టు కళావాహిని ఆడిటోరియం, స్టేడియం, పోర్టు ఆసుపత్రి, కల్యాణ మండపాలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు.  పోర్టు కార్మికులకు వెంటనే వేతన సవరణ చేయాలని, పెండింగ్‌లో ఉన్న బోనస్‌లను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు డి.ఆదినారాయణ, హెచ్‌ఎంఎస్‌ నాయకుడు శర్మ, ఇంటక్‌ నాయకుడు చందు, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.


Read more