-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Prompt resolution of response applications RDO-NGTS-AndhraPradesh
-
స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం : ఆర్డీవో
ABN , First Publish Date - 2022-10-11T06:19:47+05:30 IST
స్పందనలో ప్రజల నుంచి వస్తున్న అర్జీలు తక్షణమే పరిష్కరించాలని ఆర్డీవో భవానీశంకర్ అన్నారు.

నర్సీపట్నం, అక్టోబరు 10: స్పందనలో ప్రజల నుంచి వస్తున్న అర్జీలు తక్షణమే పరిష్కరించాలని ఆర్డీవో భవానీశంకర్ అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందన నిర్వహించి, వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. 30 వినతిపత్రాలు రాగా.. అందులో సదరం సర్టిఫికెట్లు మంజూరు కోసం పది, భూ సమస్యలపై 15, రేషన్ కార్డు సమస్యలపై ఐదుగురు వినతిపత్రాలు అందజేశారు.