-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Progress should be made in housing construction-NGTS-AndhraPradesh
-
గృహ నిర్మాణంలో పురోగతి సాధించాలి
ABN , First Publish Date - 2022-03-16T05:52:01+05:30 IST
జగనన్న లేఅవుట్‌లలో లబ్ధిదారులు గృహ నిర్మాణానికి భూమి పూజ చేసిన వెంటనే వారి బ్యాంకు ఖాతాకు రూ.10 వేలు జమవుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

భూమి పూజ చేసిన వెంటనే రూ.10 వేలు జమ
జిల్లా కలెక్టర్ మల్లికార్జున
మహారాణిపేట, మార్చి 15: జగనన్న లేఅవుట్‌లలో లబ్ధిదారులు గృహ నిర్మాణానికి భూమి పూజ చేసిన వెంటనే వారి బ్యాంకు ఖాతాకు రూ.10 వేలు జమవుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గృహనిర్మాణ పనులు, ఓటీఎస్ ప్రక్రియ, తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలందరికీ గృహ నిర్మాణ ఫలాలు అందేలా కృషి చేయాలన్నారు. పనుల్లో పురోగతి సాధించాలని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కొన్ని మండలాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు. గృహనిర్మాణ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఓటీఎస్‌లో భాగంగా నగదు చెల్లించిన వారికి త్వరితగతిన పట్టాలు అందించాలన్నారు. ఈ పట్టా ఆధారంగా ఏపీజీవీబీ రూ.3 లక్షల వరకు రుణాన్ని అందిస్తుందన్నారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, తదితరులు పాల్గొన్నారు.