తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-02-28T06:31:35+05:30 IST

మారుమూల కొండలపై ఉన్న గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని అరకు ఎంపీ మాధవి అన్నారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం
నీటి పథకానికి శంకుస్థాపన చేస్తున్న ఎంపీ మాధవిఅరకులోయ ఎంపీ మాధవి 

కొయ్యూరు, ఫిబ్రవరి 27: మారుమూల కొండలపై ఉన్న గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని అరకు ఎంపీ మాధవి అన్నారు. ఆదివారం వెలగలపాలెంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న నీటి పథకానికి ట్యాంకు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏజెన్సీలో  తాగునీటి ఎద్దడి ఉత్పన్నమవ్వకూడదనే ప్రభుత్వం వేసవికి ముందే ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రత్నకుమారి, నేతలు గొడ్డేటి మహేష్‌, పెద్దలు సత్తిబాబు, చిన్ని, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.  

Read more