కుమ్మేసిన వాన

ABN , First Publish Date - 2022-10-03T06:26:27+05:30 IST

మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఉరుములు, పిడుగులతో కురిసిన వర్షానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

కుమ్మేసిన వాన
గౌరీపట్నం రూట్‌లో రోడ్డుకడ్డంగా కూలిన చెట్టు


చోడవరంలో కూలిన వృక్షం

చోడవరం, అక్టోబరు 2: మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఉరుములు, పిడుగులతో కురిసిన వర్షానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి గౌరీపట్నం వద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో గౌరీపట్నం గ్రామానికి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం కురిసిన వర్షంతో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరాను తిరిగి ఏడు గంటల సమయంలో విద్యుత్‌ సిబ్బంది పునరుద్ధరించారు.

Read more