పోలవరం ఎత్తు తగ్గింపు కుట్రలో భాగమే

ABN , First Publish Date - 2022-11-19T03:38:33+05:30 IST

ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ8.50 లక్షల కోట్లు...

పోలవరం ఎత్తు తగ్గింపు కుట్రలో భాగమే

సీపీఐ నేత రామకృష్ణ ఆరోపణ

గుంటూరు(తూర్పు), నవంబరు 18: ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ8.50 లక్షల కోట్లు... జగన్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి అది రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుంది. రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం గుంటూరులో జరిగిన ఆ పార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ఎత్తు తగ్గించాలనుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగమేనన్నారు. అమరావతి విధ్వంసంలో భాగంగానే రాజధానిలో పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చుట్టిందని ఆరోపించారు. డిసెంబరు 5న ఇళ్ల స్థలాలపై, 12న రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడుతున్నట్టు వివరించారు.

Updated Date - 2022-11-19T03:38:33+05:30 IST

Read more