ఐదు రోజుల్లో నూరు శాతం పెన్షన్లు పంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2022-08-01T05:49:41+05:30 IST

రాష్ట్రంలో ఆగస్టు నెలకు సంబంధించి సంక్షేమ పెన్షన్ల లబ్ధిదారులకు ఐదో తేదీలోగా డబ్బులు పంపిణీ చేయాలని ఆదేశించినట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఐదు రోజుల్లో నూరు శాతం పెన్షన్లు పంపిణీ చేయాలి

కొత్తగా 3.1 లక్షల మందికి పింఛన్లు మంజూరు

మంత్రి బూడి ముత్యాలనాయుడు


అనకాపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆగస్టు నెలకు సంబంధించి సంక్షేమ పెన్షన్ల లబ్ధిదారులకు ఐదో తేదీలోగా డబ్బులు పంపిణీ చేయాలని ఆదేశించినట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు నెలలో కొత్తగా 3.1 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశామని, దీంతో ఈ నెలలో 62.79 లక్షల మంది పింఛన్‌దారులకు రూ.1,596.77 కోట్లు కేటాయించామని, ఈ మేరకు అవసరమైన నగదును శనివారంనాడే అన్ని సచివాలయాలకు పంపించామని ఆయన వెల్లడించారు. పెన్షన్ల పంపిణీలో 2.66 లక్షల మంది వలంటీర్లతో పాటు 15 వేల మంది సచివాలయాల వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీలు సేవలు అందిస్తారని మంత్రి పేర్కొన్నారు. 


Updated Date - 2022-08-01T05:49:41+05:30 IST