మహాజన సభకు ముందే గోవాడ రైతులకు బకాయిల చెల్లింపు ప్ర

ABN , First Publish Date - 2022-09-25T06:48:20+05:30 IST

గోవాడ షుగర్స్‌ సభ్య రైతులకు ఈ నెలాఖరున జరగనున్న మహాజన సభకు ముందుగానే చెరకు బకాయిలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ తెలిపారు.

మహాజన సభకు ముందే గోవాడ రైతులకు బకాయిల చెల్లింపు ప్ర
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ


విప్‌ కరణం ధర్మశ్రీ

చోడవరం, సె, సెప్టెంబరు 24: గోవాడ షుగర్స్‌ సభ్య రైతులకు ఈ నెలాఖరున జరగనున్న మహాజన సభకు ముందుగానే చెరకు బకాయిలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ తెలిపారు. శనివారం పట్టణంలోని తామరచెరువువీధిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అన్నివర్గాలను ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే బకాయిలు త్వరగా చెల్లించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రూ.144 కోట్ల అప్పుల్లో ఉన్న గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ అప్పులను రూ.40కోట్లకు తగ్గించగలిగామని, ఫ్యాక్టరీ మూతపడకుండా నిలబెట్టగలిగామన్నారు. ఈ సందర్భంగా జి. జగన్నాథపురానికి చెందిన పాత్రునాయుడు ఆధ్వర్యంలో  కొల్లివీధికి చెందిన పది కుటుంబాలు, పట్టణంలోని తామరచెరువువీధికి చెందిన పలు కుటుంబాలకు చెందిన వారు గూనూరు రాజు ఆధ్వర్యంలో ధర్మశ్రీ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాడి కాసు, శ్రీకాంత్‌, బైన ఈశ్వరరావు, బండి ఽశ్రీనివాసరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏడువాక సత్యారావు, మూడెడ్ల శంకరరావు, నెహ్రూ, బొడ్డు శ్రీరామమూర్తి, స్థానిక నాయకులు గూనూరు రాజు, దేవరపల్లి సత్య, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more