పైడిపాల జగనన్న కాలనీ భూవివాదంపై విచారణ

ABN , First Publish Date - 2022-11-16T00:55:20+05:30 IST

మండలంలోని పైడిపాల జగనన్న కాలనీకి తీసుకున్న భూమికి నష్టపరిహారం ఇవ్వలేదంటూ లబ్ధిదారులు స్పందనలో చేసిన ఫిర్యాదుపై తహసీల్దార్‌ ప్రసాదరావు మంగళవారం విచారణ చేపట్టారు.

పైడిపాల జగనన్న కాలనీ భూవివాదంపై విచారణ
భూమిని పరిశీలిస్తున్న తహసీల్దార్‌

మాకవరపాలెం, నవంబరు 15: మండలంలోని పైడిపాల జగనన్న కాలనీకి తీసుకున్న భూమికి నష్టపరిహారం ఇవ్వలేదంటూ లబ్ధిదారులు స్పందనలో చేసిన ఫిర్యాదుపై తహసీల్దార్‌ ప్రసాదరావు మంగళవారం విచారణ చేపట్టారు. పైడిపాల బీసీ కాలనీకి ఆనుకొని సర్వే నంబరు 710/1లో గల 1.95 ఎకరాల్లో 65సెంట్లు భూమిని అప్పటి తహసీల్దార్‌ రాణిఅమ్మాజీ జగనన్న కాలనీ నిమిత్తం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన రూ.11,61,875 నష్టపరిహారాన్ని సర్పంచ్‌ రుత్తల జ్యోతి, ఆమె భర్త శ్రీను పేరుల మీద బ్యాంకు ఖాతాకు జమ చేశారని, ఈ పరిహారం అర్హులైన రైతులకు సక్రమంగా అందలేదని సోమవారం ఆర్‌డీవో స్పందనలో గుడాల నూకరత్నం, గూడాల అడివిరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించమని ఆర్డీవో ఆదేశించడంతో తహసీల్దార్‌ ప్రసాదరావు మంగళవారం విచారణ చేపట్టారు. ఈ భూమి ఎంతమందికి ఇచ్చా రు.. పరిహారం ఎలా పంపిణీ చేశారనే విషయమై విచారణ చేశారు. పరిహారం పంపిణీ విధానం సరియైునదా.. కాదా అనే దానిని క్షుణంగా విచారణ చేసి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ.కృష్ణమూర్తి, సర్పం చ్‌ భర్త శ్రీను, సర్వేయరు గోపాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T00:55:20+05:30 IST

Read more