-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » pantalaku varsham debba-NGTS-AndhraPradesh
-
పంటలకు వర్షం దెబ్బ
ABN , First Publish Date - 2022-09-11T06:09:37+05:30 IST
అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి.

- నీటమునిగిన వరి, చెరకు పొలాలు
బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 10: అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. వర్షాలకు పెద్దేరు, తాచేరు, బొడ్డేరులో నదీ ప్రవాహం పెరగడంతో ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. మండలంలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వడ్డాది, విజయరామరాజుపేట, మంగళాపురం, కుముదాంపేట, లోపూడి, బంగారుమెట్ట, ఎల్.సింగవరం, పొట్టిదొరపాలెం, భట్లోవ, గంటికొర్లాం గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వరి, చెరకు పంటలు నీట మునిగాయి.