కల్యాణపులోవకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-09-13T06:13:11+05:30 IST

మండలంలోని కల్యాణపులోవ రిజర్వాయర్‌లోకి వరసగా నాలుగో రోజు కూడా వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది.

కల్యాణపులోవకు కొనసాగుతున్న వరద
కల్యాణపులోవ గేట్ల నుంచి విడుదలవుతున్న నీరు


రెండు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

రావికమతం, సెప్టెంబరు 12: మండలంలోని కల్యాణపులోవ రిజర్వాయర్‌లోకి వరసగా నాలుగో రోజు కూడా వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. సోమవారం 180 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వుంది. గరిష్ఠ నీటిమట్టం 460 అడుగులుకాగా 459.2 అడుగుల వద్ద నిలకడగా వుంచుతూ అదనపు నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. సోమవారం రెండు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీటికి దిగువకు విడుదల చేసినట్టు ఏఈ సత్యనారాయణదొర తెలిపారు. 


Read more