17న గవర్నర్‌ హరిచందన్‌ పాడేరు రాక

ABN , First Publish Date - 2022-12-13T00:09:35+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఈ నెల 17న పాడేరు రానున్నారు.

17న గవర్నర్‌ హరిచందన్‌ పాడేరు రాక
హెలీప్యాడ్‌ ఏర్పాటుపై అధికారులతో చర్చిస్తున్న పీవో గోపాలక్రిష్ణ

మెగా రక్తదాన శిబిరం ప్రారంభానికి హాజరు

పాడేరు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఈ నెల 17న పాడేరు రానున్నారు. జిల్లాలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల నిర్వహణకు గాను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణకు ఇటీవల ఉత్తమ సేవా అవార్డులు ప్రదానం చేసిన సందర్భంలో అల్లూరి జిల్లాలో పర్యటిస్తానని గవర్నర్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 17న జిల్లాకు రానున్నట్టు తెలిసింది. అదే రోజు ఇక్కడ నిర్వహించే మెగా రక్తదాన శిబిరాన్ని గవర్నర్‌ ప్రారంభించనున్నారు. ఆయన రాక సందర్భంగా హెలీప్యాడ్‌ ఏర్పాట్లను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, ఆర్‌ అండ్‌ బీ ఈఈ బాలసుందరబాబు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, తహసీల్దార్‌ వంజంగి త్రినాథరావునాయుడు తదితరులు సోమవారం పరిశీలించారు. జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్తనాపల్లి లేదా కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న మినీ స్టేడియం వద్ద గాని హెలీప్యాడ్‌ను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే గవర్నర్‌ పర్యటనను అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Updated Date - 2022-12-13T00:09:40+05:30 IST