ఎన్టీఆర్‌ తెలుగువారి గుండె చప్పుడు

ABN , First Publish Date - 2022-09-26T06:44:54+05:30 IST

ఎన్టీఆర్‌ రాజకీయనాయకుడు కాదని, తెలుగువారి గుండె చప్పుడని, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకని తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి చెప్పారు.

ఎన్టీఆర్‌ తెలుగువారి గుండె చప్పుడు
మద్దిలపాలెం జంక్షన్‌లోని తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న తెలుగు దండు సభ్యులు

విశ్వవిద్యాలయం పేరు మార్పు సరికాదు

తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి

విశాఖపట్నం, సెప్టెంబరు 25: ఎన్టీఆర్‌ రాజకీయనాయకుడు కాదని, తెలుగువారి గుండె చప్పుడని, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకని తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి చెప్పారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్షిటీని వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్షిటీగా మార్పు చేయడానికి వ్యతిరేకంగా ఆదివారం తెలుగుదండు నాయకులు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పరవస్తు సూరి మాట్లాడుతూ ప్రజాసమస్యలు పక్కతోవ పట్టించేందుకు ప్రభుత్వం ఇలాంటి రాజకీయ ఎత్తుగడకు పాల్పడిందన్నారు.   ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని పేరుమార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదండు నాయకులు చిన్న సూర్యానారాయణ, శేఖరమంత్రి ప్రభాకర్‌, నాంచారయ్య, ఆనందరావు తదితరులు సాల్గొన్నారు. 

Read more