డీసీసీబీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

ABN , First Publish Date - 2022-11-12T04:46:11+05:30 IST

చిత్తూరు, కర్నూలు, ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టులకు...

డీసీసీబీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

అమరావతి, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు, కర్నూలు, ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. లోకల్‌ జిల్లా అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు. ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలి. చిత్తూరు డీసీసీబీలో 15 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, 40 స్టాఫ్‌ అసిస్టెంట్‌/ క్లర్క్‌ పోస్టులు, కర్నూలు డీసీసీబీలో 18స్టాఫ్‌ అసిస్టెంట్‌/ క్లర్క్‌ పోస్టులు, ఏలూరు డీసీసీబీలో 95 స్టాఫ్‌ అసిస్టెంట్‌/ క్లర్క్‌ పోస్టులున్నాయి. రిజర్వేషన్‌ ప్రకారం పోస్టులు భర్తీ చేస్తారు. పీఏసీఎస్‌ ఇన్‌సర్వీ్‌స ఉద్యోగులకు 25ు పోస్టులు రిజర్వ్‌ చేశారు. వచ్చే నెలలో ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది.

Updated Date - 2022-11-12T04:46:11+05:30 IST

Read more