వైసీపీ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే..

ABN , First Publish Date - 2022-09-25T06:51:47+05:30 IST

మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్నీ కష్టాలేనని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర స్థాయిలో ధ్వజమోత్తారు.

వైసీపీ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే..
ధర్మారాయుడుపేటలో పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి


‘బాదుడే బాదుడు’లో మాజీ మంత్రి ‘బండారు’

పరవాడ, సెప్టెంబరు 24 :  మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్నీ కష్టాలేనని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర స్థాయిలో ధ్వజమోత్తారు. శనివారం రాత్రి రావాడ పంచాయతీ పరిధి ధర్మారాయుడుపేటలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగడాలు చేతపట్టి మహిళలు, యువకులతో కలిసి గ్రామంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందన్నారు. నిత్యావసర వస్తువులతో పాటు ఇసుక, కరెంట్‌, బస్సు చార్జీలు ఇలా అన్నింటి ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పథకాల పేరుతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధోగతి పాలుజేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ  పైలా జగన్నాథరావు, టీడీపీ నాయకులు అట్టా సన్యాసిఅప్పారావు, వియ్యపు చిన్నా, సారిపల్లి జోగినాయుడు, పైలా చినఅక్కునాయుడు, పైలా వరలక్ష్మి, కరణం అప్పారావు, మచ్చా శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read more