-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » New York NGO survey on plastic control-NGTS-AndhraPradesh
-
ప్లాస్టిక్ నియంత్రణపై న్యూయార్క్ ఎన్‌జీవో సంస్థ సర్వే
ABN , First Publish Date - 2022-08-17T06:28:44+05:30 IST
నగరంలో ప్లాస్టిక్ నియంత్రణ కోసం జీవీఎంసీ చేపడుతున్న చర్యలపై న్యూయార్క్‌కు చెందిన ’పార్లే ఫర్ ది ఓషన్’ అనే స్వచ్ఛంద సంస్థ మంగళవారం సర్వే చేపట్టింది.

విశాఖపట్నం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): నగరంలో ప్లాస్టిక్ నియంత్రణ కోసం జీవీఎంసీ చేపడుతున్న చర్యలపై న్యూయార్క్‌కు చెందిన ’పార్లే ఫర్ ది ఓషన్’ అనే స్వచ్ఛంద సంస్థ మంగళవారం సర్వే చేపట్టింది. అందులోభాగంగా సర్వే బృందం సభ్యులు జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించి కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీషాతో సమావేశమయ్యారు. విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను బృందం సభ్యులకు వివరించారు. అనంతరం బీచ్‌లో పలు ప్రాంతాలను పరిశీలించి ప్లాస్టిక్ నిషేధం, ప్రత్యమ్నాయ వస్తువుల వినియోగంపై సర్వే నిర్వహించారు.