28న పాఠశాలల్లో జాతీయ సైన్స్‌ డే

ABN , First Publish Date - 2022-02-23T05:52:11+05:30 IST

జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని ఈ నెల 28న అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో ఎల్‌.చంద్రకళ తెలిపారు.

28న పాఠశాలల్లో జాతీయ సైన్స్‌ డే

భీమునిపట్నం (రూరల్‌), ఫిబ్రవరి 22: జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని ఈ నెల 28న అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో ఎల్‌.చంద్రకళ తెలిపారు. పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్‌ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఈ వేడుకలను నిర్వహించాలని కోరారు. శాస్త్ర విజ్ఞాన వెలుగులను బాలబాలికల్లో నింపాలని, పాఠశాల స్థాయి నుంచే ఆవిష్కరణల దిశగా విద్యార్థులను ప్రోత్సహించి భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి దోహదపడేలా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. సైన్స్‌కు సంబంధించి వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని పేర్కొన్నారు. అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నివేదికలను జిల్లా సైన్స్‌ అధికారికి పంపాలని తెలిపారు.


Read more