‘గేట్‌’లో సత్తాచాటిన సౌమ్య

ABN , First Publish Date - 2022-03-18T06:00:06+05:30 IST

మండల కేంద్రానికి చెందిన యర్రా సౌజన్య ‘గేట్‌’లో 999వ ర్యాంకు (ఈసీఈ- ఓపెన్‌ కేటగిరీ) సాధించింది.

‘గేట్‌’లో సత్తాచాటిన సౌమ్య
తల్లిదండ్రులతో యర్రా సౌజన్య

నాతవరం విద్యార్థినికి ఈసీఈలో 999వ ర్యాంకు


నాతవరం, మార్చి 17: మండల కేంద్రానికి చెందిన యర్రా సౌజన్య ‘గేట్‌’లో 999వ ర్యాంకు (ఈసీఈ- ఓపెన్‌ కేటగిరీ) సాధించింది.  ఫిబ్రవరి మొదటి పక్షంలో ‘గేట్‌’ నిర్వహించగా గురువారం వెల్లడైన ఫలితాల్లో సౌమ్యకు 587 మార్కులు వచ్చాయి. ‘గేట్‌’ స్కోర్‌ ఆధారంగా ఐఐటీల్లో ఎంటెక్‌ ప్రవేశాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతుంటాయి. కాగా సౌమ్య తండ్రి యర్రా సూర్యప్రకాశరావు చిరువ్యాపారి. తల్లి భారతి గృహిణి. సౌమ్య నాతవరం హైస్కూల్‌లో పదో తరగతి, తరువాత నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఈసీఈ చదివింది. ఢిల్లీ లేదా ముంబై ఐఐటీలో (ఈసీఈ) ఎంటెక్‌లో సీటు వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో స్థిరపడడమే తన ధ్యేయమని సౌమ్య చెప్పింది.


Read more