AP News: నర్సీపట్నంలో జగన్ సభకు భారీగా జనాల తరలింపు

ABN , First Publish Date - 2022-12-30T11:32:23+05:30 IST

నర్సీపట్నంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభకు స్థానిక నేతలు భారీగా జనాలను తరలిస్తున్నారు.

AP News: నర్సీపట్నంలో జగన్ సభకు భారీగా జనాల తరలింపు

అనకాపల్లి: నర్సీపట్నంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభకు స్థానిక నేతలు భారీగా జనాలను తరలిస్తున్నారు. ఆర్టీసి బస్సులు, ప్రైవేటు పాఠశాల, కాలేజీ బస్సులులో జనాలను తరలించారు. దీంతో ఆర్టీసి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం సభకు స్కూల్ బస్సులు తరలించడంతో విద్యార్థులకు కూడా ఇక్కట్లు తప్పలేదు. బలవంతంగా జనాలను తరలించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-12-30T11:32:23+05:30 IST

Read more