ముగిసిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు

ABN , First Publish Date - 2022-11-24T23:31:30+05:30 IST

స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు గురువారం ముగిశాయి.

ముగిసిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు

నర్సీపట్నం, నవంబరు 24: స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గత నెల 26 నుంచి స్వామి వారి ఉత్సవాలు నెల రోజులుపాటు నిర్వహించారు. గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె. భోగలింగేశ్వరరావు, గానుగుల సత్యనారాయణ, పెదపూడి నారాయణరావు, కొమ్మోజు శ్రీను, జేఎస్‌ఎస్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:31:30+05:30 IST

Read more