Narayana comments: సీఎం జగన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-01T20:20:56+05:30 IST

సీఎం జగన్‌పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Narayana comments: సీఎం జగన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

విశాఖ (Visakha): ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సంపూర్ణ మద్య నిషేధం (alcohol Prohibition) అమలు చేస్తామని జగన్ పదే.. పదే చెప్పారని, కావాలంటే ఎన్నికల సమయంలో జగన్ మాట్లాడిన క్యాసెట్లు బయటకు తీసి చూడాలన్నారు. మద్య నిషేధం అంటే... గతంలో ఉన్న బ్రాండ్స్ నిషేధించడమా? అని ప్రశ్నించారు. ఎన్నికల మ్యానిఫెస్టో (Election Manifesto)లో పెట్టిన వాటిని.. అమలు చేయక పోతే క్రిమినల్ యాక్షన్ (Criminal Action) తీసుకోవాలన్నారు. మద్యపానాన్ని నిషేధిస్తామని అనలేదని జగన్ దైవ ప్రమాణం చేస్తే... తాము ఇక ఈ అంశంపై మాట్లాడమని అన్నారు. వైసీపీ మ్యానిఫెస్టోని.. ఆ పార్టీ నేతలే నమ్మడం లేదన్నారు. ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయని, ఆ ఆదాయాన్ని కుదవ పెట్టే స్థాయికి జగన్ సర్కార్ పడిపోయిందని నారాయణ ఎద్దేవా చేశారు.

Read more