-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » municipal chairperson inspect sachivalayam-NGTS-AndhraPradesh
-
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించొద్దు
ABN , First Publish Date - 2022-03-16T05:57:52+05:30 IST
శారదానగర్లో అక్రమ నిర్మాణాలను ఉపేక్షించ వద్దని, తక్షణమే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని మునిసిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి ఆదేశించారు.

మునిసిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి ఆదేశం
నర్సీపట్నం, మార్చి 15 : శారదానగర్లో అక్రమ నిర్మాణాలను ఉపేక్షించ వద్దని, తక్షణమే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని మునిసిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి ఆదేశించారు. మంగళవారం 16వ వార్డు శారదానగర్ సచివాలయాన్ని ఆమె సందర్శించారు. డ్రైనేజీ, పారిశుధ్యం గురించి సిబ్బందిని ఆరా తీశారు. అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న వారు చెత్తను డస్ట్బిన్లలో వేసి పారిశుధ్య కార్మికులకు అందజేసేలా అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఆమె వెంట వైస్ చైర్పర్సన్ గొలుసు నరసింహమూర్తి, కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి, డీఈ శ్రీనివాసరావు, మేనేజర్ రాఘవాచార్యులు, కో-ఆర్డినేటర్ సోమేశ్వరరావు వున్నారు.