స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు

ABN , First Publish Date - 2022-03-23T06:15:21+05:30 IST

స్టిల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 404వ రోజుకు చేరుకున్నాయి

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు
రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు

పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, మార్చి 22: స్టిల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 404వ రోజుకు చేరుకున్నాయి. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం విక్రయానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవటం వల్లనే కార్మికులకు వేతనాలను సక్రమంగా ఇవ్వకుండా అడ్డుకుంటున్నదని ఆరోపించారు. దేశంలో తమకు అనుకూలమైన కార్పొరేట్‌లకు ప్రభుత్వ సంస్థలను కట్టబెట్టాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. పోరాట కమిటీ నాయకుడు మాటూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే నిర్వాసితులకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో గంధం వెంకటరావు, మస్తానప్ప, వరసాల శ్రీనివాసరావు, కేఎస్‌ఎన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


Read more