ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2022-09-13T06:17:53+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం నాయకులు సోమవారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్టు చేయాలి

 12ఏకేపీ అర్బన్‌ 1: పట్టణ సీఐ మోహన్‌రావుకు ఫిర్యాదు పత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు


పట్టణ పోలీసు స్టేషన్‌లో టీడీపీ నాయకుల ఫిర్యాదు

అనకాపల్లి అర్బన్‌, సెపెంబరు 12 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం నాయకులు సోమవారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మళ్ల సురేంద్ర, బీఎస్‌ఎంకే జోగినాయుడు, పచ్చికూర రాము, పోలారపు త్రినాథ్‌ తదితరులు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే రోడ్లపై తిరగనీయబోమని హెచ్చరించారు. నాని కనీస సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, తక్షణమే బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సబ్బవరపు గణేష్‌, ధనాల విష్ణు చౌదరి, మరపురెడ్డి సత్యనారాయణ, కొణతాల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. 


Read more