ఎందులోనూ మంత్రి అమర్‌కు అవగాహన లేదు

ABN , First Publish Date - 2022-08-17T06:30:27+05:30 IST

ఎందులోనూ అవగాహన లేని అమర్‌నాథ్‌ను ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మంత్రివర్గంలోకి ఎలా తీసుకున్నారో అర్థం కావడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

ఎందులోనూ మంత్రి అమర్‌కు అవగాహన లేదు
సమావేశంలో మాట్లాడుతున్న బొలిశెట్టి సత్యనారాయణ, చిత్రంలో భాస్కరరావు

 జనసేన పార్టీ గురించి మాట్లాడే అర్హత అయనకు లేదు

 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆస్తి ఎంతో.. మంత్రి అయ్యాక ఎంతో ప్రజలందరికీ తెలుసు

 పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ‘బొలిశెట్టి’

 కొత్తూరు, ఆగస్టు 16 : ఎందులోనూ అవగాహన లేని అమర్‌నాథ్‌ను ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మంత్రివర్గంలోకి ఎలా తీసుకున్నారో అర్థం కావడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవ సభలో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ మాట్లాడిన అంశాల్లో.. మూడు రోజులు ర్యాలీ చేయడం కాదు.. 365 రోజుల స్వాతంత్య్ర ఉద్యమం స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవాలని  చెప్పారన్నారు. పర్యావరణ పరిరక్షణకు పవన్‌కళ్యాణ్‌ కృషి చేస్తుంటే.. పర్యావరణ విధ్వంసానికి జగన్‌రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రాభివృద్ధిపై శ్రద్ధ తీసుకోవాలని సూచిం చారు. రాష్ట్రంలో పరిస్థితులపై డిబేట్‌కు పవన్‌ కళ్యాణ్‌తో ముఖ్యమంత్రి జగన్‌ రావాలని సవాల్‌ విసిరారు. అమర్‌నాథ్‌కు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆస్తి ఎంతో.. మంత్రి అయ్యాక ఆస్తి ఎంత పెరిగిందో ప్రజలందరికీ తెలుసునన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలపై ఒక్కసారైనా మంత్రివర్గంలో చర్చ జరిగిందా.. అని ఆయన ప్రశ్నించారు.  జనసేన పార్టీకి ప్రజలు, కౌలురైతుల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ లాంటి పిచ్చుకలను వాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పిల్లమంత్రి అమర్‌నాథ్‌  రాష్ట్ర పరిస్థితులపై జ్ఞానం తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేని మంత్రి చేతకాని మాటలు ఆడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జి పరుచూరి భాస్కరరావు మాట్లాడుతూ ప్రజలంతా వైసీపీకి ఓట్లు వేసి 151 సీట్ల కట్టబెడితే... సదరు నాయకులు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఒక్క అవకాశం ఇస్తే  ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు కృషి చేస్తామని చెప్పిన నేతలు.. నేడు   కనీసం ప్రత్యేక హోదా కోసం ప్లకార్డులు కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.  గత ప్రభుత్వంలో మంజూరు చేసిన కంపెనీల్లో మళ్లీ శంకుస్థాపనలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  అమర్‌నాథ్‌కు చిత్తశుద్ధి ఉంటే మూతపడిన తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు. ప్రతిసారీ పవన్‌కళ్యాణ్‌ని ప్యాకేజీ అంటున్న అమర్‌నాథ్‌.. ఎంత ప్యాకేజీలు ఇస్తే తనకు మంత్రి పదవి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోసారి జనసేన పార్టీ గురించి గానీ, తమ అధినేత పవన్‌కళ్యాణ్‌ గురించి గానీ మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2022-08-17T06:30:27+05:30 IST