మీటర్లు.. రైతుల మెడకు ఉరితాళ్లు: అమరనాథరెడ్డి

ABN , First Publish Date - 2022-11-12T04:40:46+05:30 IST

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లవుతాయని మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు. ..

మీటర్లు.. రైతుల మెడకు ఉరితాళ్లు: అమరనాథరెడ్డి

అమరావతి, (ఆంధ్రజ్యోతి), హిందూపురం, రాజమహేంద్రవరం, నవంబరు 11: వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లవుతాయని మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.3 వేల విలువజేసే మీటర్లకు రూ.6.5 వేలతో కొనేందుకు టెండర్లుకు పిలిచారని, ఇది ఇంకోరకం దోపిడీ అని అన్నారు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంతో ఆక్వా రంగం కుదేలవ్వగా, మంత్రుల కమిటీ ఏర్పాటయ్యాక ఆక్వా రైతులు పంట విరామం ప్రకటించే పరిస్థితి వచ్చిందని వ్యవసాయశాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి విమర్శించారు. కాగా, ‘వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబం అంతా అవినీతి సొమ్ము మెక్కి బతుకుతోంది’ అని జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అఽధ్యక్షుడు, పొలికట్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యుడు, కందుల దుర్గేశ్‌ రామమండ్రిలో అన్నారు.

Updated Date - 2022-11-12T04:40:46+05:30 IST

Read more