క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2022-03-16T06:04:50+05:30 IST

నిత్యం ప్రజాసమస్యల పరిష్కారం కోసం తీరిక లేకుండా గడిపే కార్పొరేటర్లకు క్రీడలు ఉల్లాసాన్నిస్తాయని జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం
షటిల్‌ పోటీలు ప్రారంభిస్తున్న మేయర్‌ హరివెంకటకుమారి, కమిషనర్‌ లక్ష్మీషా తదితరులు

కార్పొరేటర్ల కీడ్రా పోటీల ప్రారంభంలో మేయర్‌

విశాఖపట్నం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): నిత్యం ప్రజాసమస్యల పరిష్కారం కోసం తీరిక లేకుండా గడిపే కార్పొరేటర్లకు క్రీడలు ఉల్లాసాన్నిస్తాయని జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అన్నారు. కార్పొరేటర్లకు ఏర్పాటు చేసిన క్రీడాపోటీలను స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. కౌన్సిల్‌ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా  ఏర్పాటు చేసిన ఈ పోటీలలో పార్టీల కతీతంగా కార్పొరేటర్లు పాల్గొని తమ క్రీడాస్ఫూర్తిని చాటడటం ఆనందంగా ఉందన్నారు. కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా మాట్లాడుతూ కార్పొరేటర్లంతా ఏడాదికి ఒకసారి ఇలా క్రీడాపోటీల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యంతోపాటు వారి మధ్య సోదరభావం పెరుగుతుందన్నారు. డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ 2010 తర్వాత తిరిగి ఇన్నాళ్లకు కార్పొరేటర్లకు ఆటల పోటీలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. పోటీల సందర్భంగా పాఠశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్లు, పారిశుధ్య కార్మికులతోపాటు కార్పొరేటర్లు మార్ఛ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు, కార్పొరేటర్లకు జ్ఞాపికలను అందజేశారు. ఈనెల 18 వరకూ పోటీలు జరుగుతాయి. 


Updated Date - 2022-03-16T06:04:50+05:30 IST