58.6 అడుగులకు చేరిన ‘మేహాద్రిగెడ్డ’

ABN , First Publish Date - 2022-10-08T05:50:19+05:30 IST

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నీటిమట్టం పెరగడంతో జలాశయం నుంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.

58.6 అడుగులకు చేరిన ‘మేహాద్రిగెడ్డ’
రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

జలాశయం నుంచి 1,200 క్యూసెక్కుల నీరు విడుదల

గోపాలపట్నం, అక్టోబరు 7: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నీటిమట్టం పెరగడంతో జలాశయం నుంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌ నీటిమట్టం 58.6 అడుగులకు చేరింది. రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల్లో వున్న చెరువులు నిండిపోవడంతో ఏ మాత్రం వర్షం కురిసినా జలాశయానికి ఇన్‌ఫ్లో భారీగా వస్తుంది. దీంతో గురువారం రెండు గేట్లు ఎత్తి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే శుక్రవారానికి ఇన్‌ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టడంతో ఒక గేటును మూసివేసి మరో గేటును రెండడుగుల మేర ఎత్తి 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 


Updated Date - 2022-10-08T05:50:19+05:30 IST