కార్మిక సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , First Publish Date - 2022-09-30T06:04:24+05:30 IST

ప్రజారవాణాశాఖ ( పీటీడీ) కార్మికుల సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే, తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చింతా రవికుమార్‌ అన్నారు.

కార్మిక సమస్యల పరిష్కారానికి చర్యలు
ఈడీతో సమావేశమైన ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు

 పీటీడీ విజయనగరం జోన్‌ ఈడీ రవికుమార్‌

ద్వారకాబస్‌స్టేషన్‌, సెప్టెంబరు 29: ప్రజారవాణాశాఖ ( పీటీడీ) కార్మికుల సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే, తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చింతా రవికుమార్‌ అన్నారు. పీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నూతన జోనల్‌ కమిటీ నాయకులు గురువారం ఎంవీపీ కాలనీలోని ఈడీ క్యాంప్‌ కార్యాలయంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ పీటీడీలో పలు సంస్కరణలు అమలు జరుగుతున్నాయని, వాటిని అనుసరించి కార్మికులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, జోనల్‌ అధ్యక్షుడు కేజే శుభాకర్‌, కార్యదర్శి బాసూరి కృష్ణమూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.శంకరరావు, కోశాధికారి జి.తాతలు, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన యూనియన్‌ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-30T06:04:24+05:30 IST