మన్యంలో ముసురు

ABN , First Publish Date - 2022-10-03T05:22:53+05:30 IST

మన్యంలో ఆదివారం ముసురు వాతావరణం నెలకొంది. పలు చోట్ల భారీ, మోస్తరు వర్షం కురవగా, పలు ప్రాంతాల్లో జల్లులతో కూడిన వాన పడింది.

మన్యంలో ముసురు
హుకుంపేటలో వర్షం కురుస్తున్న దృష్యం

పలు చోట్ల భారీ, మోస్తరు వర్షం

పాడేరు, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం ముసురు వాతావరణం నెలకొంది. పలు చోట్ల భారీ, మోస్తరు వర్షం కురవగా, పలు ప్రాంతాల్లో జల్లులతో కూడిన వాన పడింది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఏజెన్సీలో పొగ మంచు కమ్ముకుంది. ఆ తరువాత నుంచి ఎండ కాసింది. మధ్యాహ్నం రెండు గంటల తరువాత నుంచి ఆకాశం మేఘావృతమై మబ్బుల వాతావరణం కొనసాగింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వర్షం కురిసింది.  పాడేరు, పరిసర ప్రాంతాలతో పాటు హుకుంపేట, జి.మాడుగుల ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ముంచంగిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో జల్లులతో మొదలై ఒక మోస్తరుగా వాన కురిసింది. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో రాత్రి వర్షం పడింది. 

హుకుంపేట..

హుకుంపేట:  మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు చిత్తడిగా మారాయి. 

Read more