చంద్రబాబును కలిసిన మన్యం సర్పంచులు

ABN , First Publish Date - 2022-03-04T06:11:23+05:30 IST

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మన్యంలోని పలువురు సర్పంచులు తరలివెళ్లారు.

చంద్రబాబును కలిసిన మన్యం సర్పంచులు
చంద్రబాబునాయుడుకు బొకే ఇస్తున్న ఏజెన్సీ సర్పంచులుపాడేరు, మార్చి 3: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మన్యంలోని పలువురు సర్పంచులు తరలివెళ్లారు. వివిధ అంశాలపై శిక్షణ పొం దారు. అలాగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడ్ని మన్యానికి చెందిన సర్పంచ్‌లు కలిశారు. ఈసందర్భంగా మన్యంలోని పరిస్థితులను వారికి తెలిపారు.  చంద్రబాబుని కలిసిన వారిలో బాకూరు వెంకటరమణరాజు, కొట్టగుళ్లి ఉషారాణి, పాంగి పాండురంగస్వామి, పెట్టెలి దాసుబాబు, తామర్ల సత్యనారాయణ, సోమెలి లక్ష్మయ్య, వంతాల శ్రీనివాసరావు, కూడ శ్రీలక్ష్మి ఉన్నారు. 

Read more