మన్యం గజగజ

ABN , First Publish Date - 2022-11-30T01:04:26+05:30 IST

ప్రస్తుతం మన్యంలో పొగ మంచు తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పదిన్నర గంటల వరకు దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. దీంతో రోడ్డు మార్గం సరిగా కనిపించక లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పొగ మంచుతో ఏజెన్సీలోని వాతావరణం మరింత అందంగా దర్శనమిస్తున్నది.

మన్యం గజగజ
పాడేరులో మంగళవారం ఉదయం తొమ్మిదిన్నరకు పొగ మంచు

- కొనసాగుతున్న చలి తీవ్రత

- చింతపల్లిలో 11 డిగ్రీలు

పాడేరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం మన్యంలో పొగ మంచు తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పదిన్నర గంటల వరకు దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. దీంతో రోడ్డు మార్గం సరిగా కనిపించక లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పొగ మంచుతో ఏజెన్సీలోని వాతావరణం మరింత అందంగా దర్శనమిస్తున్నది.

చింతపల్లిలో...

చింతపల్లి: ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం చింతపల్లిలో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ తెలిపారు. డిసెంబరు, జనవరిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం లంబసింగి, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తున్నది. రాత్రి, ఉదయం మంచు ఉధృతికి రహదారి కనిపించడం లేదు. దీంతో వాహనాలు నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చలి పెరిగిపోవడంతో స్థానికులు పగలు, రాత్రి అనే తేడాలేకుండా ఉన్ని దుస్తులు ధరించి కనిపిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రధాన కేంద్రాల్లో జనసంచారం పెద్దగా కనిపించడంలేదు. చలి కారణంగా కాఫీ రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

హుకుంపేటలో..

హుకుంపేట: మండలంలో మంగళవారం ఉదయం 10 గంటలైనా మంచు తెరలు వీడలేదు. దీంతో వాహనచోదకులు నెమ్మదిగా రాకపోకలు సాగించాల్సి వచ్చింది.

Updated Date - 2022-11-30T01:04:26+05:30 IST

Read more