మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-03-23T06:13:13+05:30 IST

: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సుందరయ్యకాలనీ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది.

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

గాజువాక, మార్చి 22: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సుందరయ్యకాలనీ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రం ఖరగ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన అరవింద్‌(28) బతుకు తెరువు కోసం గాజువాక ప్రాంతానికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనగర్‌ ప్రాంతానికి చెందిన ఝాన్సీని అరవింద్‌ 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇదిలావుండగా అరవింద్‌ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం అరవింద్‌ భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌ హుక్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి పట్టాభి ప్రసాదరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. 

Read more