సీపీఐ జాతీయ మహాసభలు విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-10-12T04:40:28+05:30 IST

ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకూ విజయవాడలో నిర్వహిస్తున్న సీపీఐ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు కోరారు.

సీపీఐ జాతీయ మహాసభలు విజయవంతం చేయండి
జాతీయ మహాసభల పోస్టర్‌ విడుదల చేస్తున్న సీపీఐ కార్యకర్తలు


చోడవరం, అక్టోబరు 11: ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకూ విజయవాడలో నిర్వహిస్తున్న సీపీఐ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు కోరారు. మంగళవారం స్థానిక పాతబస్డాండ్‌ ఆవరణలో సీపీఐ జాతీయ మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా సీపీఐ మారిందన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు  తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు నేమాల హరి, గోవాడ కనకమహలక్ష్మి, పొట్నూరు మరిడయ్య, దేవి, సన్యాసమ్మ,  లక్ష్మి, నేమాల నరసింగరావు పాల్గొన్నారు. 

Read more