మాడుగుల సంతకు భారీగా సీతాఫలాలు

ABN , First Publish Date - 2022-09-13T06:14:21+05:30 IST

మాడుగులలో సోమవారం జరిగిన సంతకు పలు గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద మొత్తంలో సీతాఫలాలు తీసుకువచ్చారు.

మాడుగుల సంతకు భారీగా సీతాఫలాలు
మాడుగుల సంతకు గిరిజనులు తీసుకువచ్చిన సీతాఫలాలు


గత వారంతో పోలిస్తే 40 శాతం మేర తగ్గిన ధరలు


మాడుగుల, సెప్టెంబరు 12: మాడుగులలో సోమవారం జరిగిన సంతకు పలు గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద మొత్తంలో సీతాఫలాలు తీసుకువచ్చారు. పాడేరు మండలం దేవాపురం, కక్కి, వంట్లమామిడి, కందులపాలెం, ఈదులపాలెం, చింతగరువు, పులసుమామిడి, తదితర గామాల నుంచి బుట్టలతో, కావిళ్లతో మోసుకొచ్చారు. కావిడి (సుమారు 130 సీతాఫలాలు) ధర గత వారం రూ.1500 వరకు పలకగా, ఈ వారం పండు పరిమాణాన్నిబట్టి కావిడి ధర రూ.600 నుంచి రూ.1,000 మాత్రమే పలికింది. కొద్దిసేపటి తరువాత సంతలో కొనుగోలు చేసే వ్యాపారులు లేకపోవడంతో  మిగిలిన ఫలాలను బస్టాండ్‌ వద్దకు తీసుకువచ్చి డజన్ల చొప్పున విక్రయించారు.


Read more