పాలసీదారులకు బోనస్‌ పెంచని ఎల్‌ఐసీ

ABN , First Publish Date - 2022-09-24T06:31:03+05:30 IST

పాలసీదారులకు బోనస్‌ పెంచే అవకాశం ఉన్నా ఎల్‌ఐసీ సంస్థ పట్టించుకోవడం లేదని ఎల్‌ఐసీ ఏజెంట్ల ఫెడరేషన్‌(లియాఫీ) ఆలిండియా జనరల్‌ సెక్రటరీ ఎన్‌.గజపతిరావు ఆరోపించారు.

పాలసీదారులకు బోనస్‌ పెంచని ఎల్‌ఐసీ
మాట్లాడుతున్న లియాఫీ జనరల్‌ సెక్రటరీ గజపతిరావు

అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు

లియాఫీ ఆలిండియా జనరల్‌ సెక్రటరీ గణపతిరావు

నర్సీపట్నం, సెప్టెంబరు 23: పాలసీదారులకు బోనస్‌ పెంచే అవకాశం ఉన్నా ఎల్‌ఐసీ సంస్థ పట్టించుకోవడం లేదని ఎల్‌ఐసీ ఏజెంట్ల ఫెడరేషన్‌(లియాఫీ) ఆలిండియా జనరల్‌ సెక్రటరీ ఎన్‌.గజపతిరావు ఆరోపించారు. శుక్రవారం నర్సీపట్నంలో ఎల్‌ఐసీ ఏజెంట్ల ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల కన్నా ఎల్‌ఐసీ వడ్డీ రేట్లు ఎక్కువ వసూలు చేస్తోందన్నారు. ఎల్‌ఐసీ ఏజెంట్ల కమీషన్‌ పెంచడానికి ఐఆర్‌డీఏ అనుమతి ఇచ్చినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని తెలిపారు. అనేక కష్టాలను తట్టుకుని వ్యాపారాన్ని సమీకరిస్తున్న ఏజెంట్లు అందరికీ ఆరోగ్య బీమా ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. ఏజెంట్‌ పోర్టబిలిటీ ప్రవేశ పెట్టాలన్న ఐఆర్‌డీఏ నిర్ణయాన్ని లియాఫీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో డివిజన్‌ అధ్యక్షుడు బి.తిరుమలరావు, ఈసీ సభ్యుడు రమణ, బ్రాంచి అధ్యక్షుడు వి.చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


Read more