-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Let protect Vishakha steel with Alluri fighting spirit-NGTS-AndhraPradesh
-
అల్లూరి పోరాట స్ఫూర్తితో విశాఖ ఉక్కును కాపాడుకుందాం
ABN , First Publish Date - 2022-04-24T06:50:22+05:30 IST
అల్లూరి పోరాట స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందామని ఏఐవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యవర్గవర్గ సభ్యుడు అమర్ అన్నారు.

ఏఐవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యవర్గవర్గ సభ్యుడు అమర్
పాడేరురూరల్, ఏప్రిల్ 23: అల్లూరి పోరాట స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందామని ఏఐవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యవర్గవర్గ సభ్యుడు అమర్ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం అంబేడ్కర్ కూడలి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు 32 మంది అమరువీరుల త్యాగఫలితంగా ఏర్పాటు అయ్యిందని, దానిని బీజేపీ ప్రభుత్వం పోస్కోకి విక్రయించేందుకు కుట్ర పన్నుతున్నందన్నారు. నాడు రాజకీయ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి విశాఖ ఉక్కును సాధిస్తే.. నేటి నేతలు వారి పదవులను కాపాడుకొనేందుకు నోరు మెదపడం లేదన్నారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో మాట్లాడకుండా ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఎం.లక్ష్మణ్, కె.సురేష్, కె.చంటిబాబు, పి,మధు పాల్గొన్నారు.