సమన్వయంతో కొవిడ్‌ను కట్టడి చేయాలి

ABN , First Publish Date - 2022-01-23T06:03:11+05:30 IST

జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి కొవిడ్‌ విస్తరణను అడ్డుకోవాలని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు.

సమన్వయంతో కొవిడ్‌ను కట్టడి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ ఎ.మల్లికార్జున

విశాఖపట్నం, జనవరి 22: జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి కొవిడ్‌ విస్తరణను అడ్డుకోవాలని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి కిట్లు సత్వరం అందించాలని ఆదేశించారు. రిపోర్టులు సత్వరం అందించాలన్నారు. ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని, ప్రైవేటు ల్యాబ్స్‌లో పరీక్షలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా, జేసీ పి.అరుణబాబు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Read more