కిరండోల్‌ రైళ్లు దంతెవాడ వరకే...

ABN , First Publish Date - 2022-09-11T06:04:00+05:30 IST

విశాఖపట్నం-కిరండోల్‌ మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసులను భద్రతా కారణాల రీత్యా ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు కుదించినట్టు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

కిరండోల్‌ రైళ్లు దంతెవాడ వరకే...

విశాఖపట్నం, సెప్టెంబరు 10:


విశాఖపట్నం-కిరండోల్‌ మధ్య నడుస్తున్న  ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసులను భద్రతా కారణాల రీత్యా ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు కుదించినట్టు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. 18514 నంబర్‌ గల రైలు ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు విశాఖపట్నం నుంచి దంతెవాడ వరకు...తిరుగు ప్రయాణంలో 18513 నంబరు గల రైలు ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు దంతెవాడ నుంచి విశాఖ వరకూ నడుస్తాయి. అలాగే 08551 నంబరు గల రైలు ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు విశాఖ నుంచి దంతెవాడ వరకు...తిరుగు ప్రయాణంలో 08552 నంబర్‌ గల రైలు ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు దంతెవాడ నుంచి విశాఖ వరకూ నడుస్తాయి. 

Read more