కేబీ రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి

ABN , First Publish Date - 2022-08-31T06:32:48+05:30 IST

కశింకోట-బంగారుమెట్ట రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని విద్యార్థులు మంగళవారం ధర్నా చేపట్టారు.

కేబీ రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి
వీజే పాలెం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు


వీజేపాలెం సమీపంలో విద్యార్థులు, వాహనచోదకులు ధర్నా


కొత్తూరు, ఆగస్టు 30 : కశింకోట-బంగారుమెట్ట రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని విద్యార్థులు మంగళవారం ధర్నా చేపట్టారు. పీటీడీ బస్సులో వెళ్తున్న విద్యార్థులు పెద్ద పెద్ద గోతుల్లోంచి బస్సు వెళుతుంటే అసహనం వ్యక్తం చేసి వేటజంగాలపాలెం సమీపంలో బస్సు దిగి రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనాల రాకపోకలు సుమారు గంటసేపు నిలిచిపోయాయి. విద్యార్థులు చేస్తున్న నిరసనకు వాహనచోదకులు కూడా మద్దతు తెలిపారు. ఈ రోడ్డులో ప్రయాణించాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. కేబీ రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని విద్యార్థులు, వాహనచోదకులు డిమాండ్‌ చేశారు.

 

Read more